హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రైల్ రోకోకు దక్షిణ, మధ్య రైల్వే విరుగుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణలో తలపెట్టిన మూడు రోజుల రైల్ రోకోకు దక్షిణ మధ్య రైల్వే విరుగుడు ఆలోచిస్తోంది. రైళ్లు నడిపి తీరుతామని అంటోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్సితో రైల్వే అధికారులు బుధవారం సమావేశమయ్యారు. డిజిపి, రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష కూడా నిర్వహించారు. ఈ నెల 9,10,11 తేదీల్లో తెలంగాణ జెఎసి రైల్ రోకోకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుతో రైళ్లను అడ్డుకోవాలని నిర్ణయించింది. దీంతో రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యామ్నాయాలు చూస్తోంది.

రైల్ రోకో సందర్బంగా రైళ్లను నడపాలని అనుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఎజిఎం మోహన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైళ్ల రాకపోకల షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రద్దయ్యే రైళ్ల షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రైళ్లను రూట్లు మళ్లించి నడిపిస్తామని ఆయన అన్నారు. స్థానిక పోలీసుల సహకారంతో రైళ్లను నడపడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

English summary
South Central Railway has decided to run trains during 3 days rail roko in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X