హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దసరా తర్వాత తెలంగాణపై స్పష్టత: ఎంపీ ఉండవల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
హైదరాబాద్: దసరా పండుగ తర్వాత చర్చల ప్రక్రియ ద్వారా తెలంగాణపై స్పష్టత వచ్చే అవకాశముందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం అన్నారు. ఉద్యమాల ద్వారా ప్రత్యేక రాష్ట్ర్లాలు ఏర్పడిన సందర్భాలు ఎక్కడా లేవన్నారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చితే అది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అంశం రాష్ట్రం చేతుల్లో లేదని కేంద్రం చేతుల్లో ఉందని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం సమస్య పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితికి నైతిక విలువలు లేవన్నారు. సకల జనుల సమ్మె పేరుతో ప్రయాణీకులపై తెలంగాణవాదులు దాడులు చేయడం మంచిది కాదన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసమర్థుడన్నారు.

కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యల్లో తప్పేమి లేదని కాంగ్రెసు సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు అన్నారు. ప్రణబ్ సీనియర్ రాజకీయ వేత్త అని ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటుందన్నారు. రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటన మానవ తప్పిదాల్లో ఒకటన్నారు. కేంద్రం ఆ తర్వాత 23వ తారీఖున చేసిన ప్రకటనను తెలంగాణవాదులు అర్థం చేసుకోవాల్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు పూటకో నీతిగా ఉందన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి అన్నారు. ఊసరవెల్లి ఎలా రంగులు మారుస్తుందో బాబు అలా మారుస్తారన్నారు. కాంగ్రెసు జాతీయ పార్టీ అని తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుందన్నారు.

English summary
Rajahmundry MP Undavalli Arun Kumar said today that Telangana issue will solved after Dussera festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X