వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి పాలన దిశగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులపై విసిగిపోయిన కాంగ్రెసు అధిష్టానం ఆ దిశగా వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్లదినపత్రిక రాసింది. తెలంగాణ సకల జనుల సమ్మెను విరమించకుండా పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రపతి పాలన విధించడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లోగా తెలంగాణ సాధ్యం కాదని కాంగ్రెసు అధిష్టానం చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు ఆ పత్రిక రాసింది. దాంతో రాష్ట్రంలో విధ్వంసకర వాతావరణం చోటు చేసుకునే ప్రమాదం ఉందని, దాన్ని ప్రభుత్వం నియంత్రించే పరిస్థితి లేకపోవపడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందని అంటున్నారు.

తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఇప్పటికే రాజీనామాలు చేశారు. వాటిని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగులో పెట్టారు. వాటిని ఆయన ఎంతో కాలం పెండింగులో పెట్టలేరనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు ఒత్తిడి తట్టుకోలేక ఒక్కరొక్కరే గానీ తెలంగాణ ప్రకటన వెలువడిన వెంటనే మూకుమ్మడిగా గానీ రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలో వాటిని కూడా స్పీకర్ ఆమోదించాల్సి వస్తే తీవ్ర సమస్య ఎదురు కావచ్చు.

ప్రజారాజ్యం పార్టీ విలీనం వల్ల లభించిన 17 మంది శాసనసభ్యులు, ఏడుగురు మజ్లీస్ శానసభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి డోకా ఏమీ లేదు. కానీ కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేస్తే, వాటిని ఆమోదించాల్సి వస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. మధ్యంతర ఎన్నికలకు వెళ్తే కాంగ్రెసుకు ఓటమి ఖాయం. అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడమే మేలనే దిశగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Fed up with the state of affairs in Andhra Pradesh, the Congress bosses in Delhi are ready to clamp President's rule in the state, if the there is no let-up in the agitations for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X