హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్ రెడ్డిపై గుర్రుమన్న చుక్కా రామయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Chukka Ramaiah
హైదరాబాద్: తన విద్యాబోధనను తప్పు పట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఐఐటి రామయ్యగా పేరు పొందిన ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలతో తన విద్యాసంస్థలను భూస్థాపితం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన శుక్రవారం విమర్శించారు. బట్టీ పట్టే విధానాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రమేయంతోనే ముఖ్యమంత్రి తనపై విమర్సలు చేస్తున్నారని ఆయన అన్నారు.

కార్పోరేట్ విద్యా సంస్థల ప్రమేయంపై, తన విద్యాబోధనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, ముఖ్యమంత్రి కూడా చర్చకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంపై వాస్తవాలు తెలుసుకుని ముఖ్యమంత్రి మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు. చుక్కా రామయ్య విద్యా సంస్థల విధానం తనకు నచ్చదని కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో గురువారం సాయంత్రం అన్నారు. చుక్కా రామయ్య పద్ధతి వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు.

English summary
MLC Chukka Ramaiah retaliated CM Kiran Kumar Reddy's comments on his educational institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X