వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ నటుడు దర్శన్‌కు షరతులతో బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Darshan
బెంగళూరు: భార్యపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణల కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దర్శన్‌కు జస్టిస్ బివి పింటో షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు దర్శన్‌తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి తన ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

బెయిల్ కోసం దర్శన్ 25 వేల రూపాయల బాండ్‌తో కూడిన వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. గత 29 రోజులుగా దర్శన్ జైలులో ఉన్నారు. తాజా పరిణామం తనకు సంతోషాన్నిస్తోందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాబోవని తాను దర్శన్ మిత్రులకు, అభిమానులకు హామీ ఇస్తున్నానని విజయలక్ష్మి అన్నారు. క్షమించాలని వారిని తాను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. పరిణామాలు ఇంత తీవ్ర స్థాయికి వెళ్తాయని అనుకోలేదని, తన భర్తను ఇంటికి ఆహ్వానించడానికి ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.

English summary
After a long time Kannada actor Darshan received relief for the time being. The actor, who was accused of bashing his wife and allegedly threatened to kill his wife and his child, got conditional bail on Friday, Oct 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X