వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యతో కెసిఆర్ భేటీ చివరి నిమిషంలో రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భేటీ చివరి నిమిషంలో రద్దయింది. ఆయన శుక్రవారం సాయంత్రం రోశయ్యను కలవాల్సి ఉండింది. మర్యాదపూర్వకంగానే రోశయ్యను కెసిఆర్ కలవాలని అనుకున్నారని తెరాస వర్గాలంటున్నాయి. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో రోశయ్యతో సమావేశమైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో కెసిఆర్ రోశయ్యతో భేటీని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.

కాగా, తెలంగాణకు సంబంధించిన తమ వ్యూహం తమకు ఉంటుందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ జెఎసి సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల పట్ల అనుసరించాల్సిన వ్యూహాన్ని రేపటి తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ ఈ నెల 11వ తే్దీన ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీలతో భేటీ కావాలనేది ఆయన ఉద్దేశ్యం. కెసిఆర్ ఢిల్లీ యాత్ర తర్వాతనే రైలో రోకో నిర్వహించాలనే అంశం శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
TRS president K Chandrasekhar Reddy proposed meeting with Tamilnadu governor Rosaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X