వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పరిణామాలపై పురంధేశ్వరి అసంతృప్తి?

By Pratap
|
Google Oneindia TeluguNews

purandheswari
న్యూఢిల్లీ: తెలంగాణ పరిణామాలపై అధిష్టానం పెద్దల తీరు పట్ల సీమాంధ్రకు చెందిన కేంద్ర సహాయ మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పల్లంరాజు కాస్తా అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన శనివారం జరుగుతున్న మినీ కోర్ కమిటీ ముందు వారు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రణబ్‌తో పాటు చిదంబరం, ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ పాల్గొన్న సమావేశంలో పురంధేశ్వరి తన సమైక్యవాదాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలతో భేటీ తర్వాత పురంధేశ్వరి కాస్తా అసంతృప్తికి కనిపించారు. మీడియాతో కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. సమస్య క్లిష్టమైందని ప్రణబ్ ఇప్పటికే చెప్పారని పురంధేశ్వరి అన్నారు. తనకు ఏ విధమైన సిగ్నల్స్ లేవని ఆమె అన్నారు.

తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తాను వినిపించానని పురంధేశ్వరి అన్నారు. ఎప్పటిలోగా నిర్ణయం జరుగుతుందని అడిగితే తాను చెప్పలేనని, ఆ విషయం ప్రణబ్ ముఖర్జీ చెప్పాలని ఆమె అన్నారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరానని పళ్లంరాజు చెప్పారు. సకల జనుల సమ్మె, ఆందోళనల వల్ల రాష్ట్రం నష్టోతోందని, అందువల్ల బాధ్యత గల పార్టీగా, ప్రభుత్వంగా సమస్యను పరిష్కరించాల్సి ఉందని ఆయన అన్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని వివరాలు అందించానని ఆయన చెప్పారు. ఆందోళనల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన అన్నారు. సామరస్యవూర్వకమైన పరిష్కారం చూపాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎప్పుడు నిర్ణయం వెల్లడిస్తారనేది తనకు తెలియదని ఆయన అన్నారు.

English summary
It seems that union minister Daggubati Purandheswari is not happy with the developments on Telangtana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X