వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు నివేదిక వద్దు: గవర్నర్‌కు కోదండరామ్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెపై గవర్నర్ నరసింహన్ తప్పుడు నివేదిక ఇచ్చినట్లయితే ఆయన వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని లేదంటే ఉద్యమం హింసాత్మకంగా మారే అవకాశముందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం హెచ్చరించారు. సింగరేణి ఎన్ఎంయు ఉద్యోగులు చేపట్టిన బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. ఎన్ఎంయులో ఎలాంటి విభేదాలు లేవన్నారు. అదంతా మీడియా సృష్టియేనన్నారు.

ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమ్మె విరమించే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పారు. బస్సు యాత్ర బొగ్గు గనుల ప్రాంతాల్లో ఉంటుందని చెప్పారు. మట్టి పనులు చేస్తున్న వారు కూడా తెలంగాణ కోసం పనిని ఆపాలని కోరారు. ఉద్యమంలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram warned
 governor Narasimhan today. He appealed all the people of Telangana to participate in strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X