హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం మరో యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ సృష్టించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విష్ణు అనే యువకుడు జూబ్లీహిల్స్‌లోని హోర్డింగ్ ఎక్కి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మికులు, ఆర్టీసి ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హామీ ఇచ్చిన తర్వాతనే తాను కిందకు దిగుతానని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న వారిపై వేధింపులు మానుకోవాలని సూచించారు.

విష్ణును కిందకు దింపడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అతను మాత్రం ససేమీరా అన్నాడు. ఇతను గత సంవత్సరం కూడా మాదాపూర్‌లో సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. కాగా మూసాపేట్ చౌరస్తా వద్ద లిక్కర్ యాజమాన్యం ఆందోళనకు దిగింది. సమ్మె కాలంలో లిక్కర్ పై పన్నును తొలగించాలని డిమాండ్ చేసింది. సమ్మె కొనసాగించాలో లేదో నిర్ణయం ప్రకటిస్తామని ఎన్ఎంయు నేత మహమూద్ ప్రకటించారు. సమ్మె విరమించేందుకు ఎన్ఎంయు అగ్రనేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదని తెలంగాణ ఎన్ఎంయు నేతలు అంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్ఎంయులో విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
A young from Mahaboob Nagar district was created hulchul at Jubilee Hills for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X