హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునీతా రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిబిఐ సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Suneetha Reddy
హైదరాబాద్: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు సోమవారం ఉదయం అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి కూతురు, గ్రూప్ జాయింట్ ఎండి సునీతా రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే సునీతా రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. సునీతా రెడ్డి 2005లో ఎయిర్ సెల్ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు సెప్టెంబర్ 15వ తేదీన సునీతారెడ్డిని ప్రశ్నించారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌నకు చెందిన ప్రతాప్ సి. రెడ్డి కూతురు పాత్రపై సిబిఐ గతంలోనే దృష్టి పెట్టింది. ఎయర్ సెల్ కంపెనీలో సునీతా రెడ్డి వాటాపై సిబిఐ ఆరా తీసింది. రెడ్డి సబ్సిడరీలో మలేషియా కంపెనీ మాక్సిస్ వంద శాతం ప్రిఫరెన్స్ షేర్ల సబ్‌స్క్రీప్షన్‌పై సిబిఐ వివరణ కోరినట్లు తెలుస్తోంది. మాక్సిస్ 74 శాతానికి 7800 కోట్లు చెల్లించగా, సునీతా రెడ్డి, ఆమె భర్త 34 కోట్లకే 26 శాతం వాటా ఎలా పొందారనే విషయంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఎయిర్‌సెల్‌ను విక్రయించాలని తనపై కేంద్ర మంత్రి దయానిధి మారన్ ఒత్తిడి తెచ్చారని శివశంకరన్ చెప్పిన తర్వాత ఎయిర్‌సెల్ డీల్‌ను సిబిఐ పరిశీలిస్తోంది.

టెలికం రంగంలో అపోలోకు గానీ ప్రతాప్ సి రెడ్డికి గానీ పెట్టుబడులు లేవని, పి. ద్వారకానాథ్ రెడ్డి, సునీతా రెడ్డి ప్రమోట్ చేసిన సింద్యా సెక్యురిటీస్‌కు ఎయిర్‌సెల్‌లో వాటాలు ఉన్నాయని అపోలో ఆస్పత్రుల గ్రూప్ గత జూన్‌లో ఓ అధికారిక ప్రకటనలో చెప్పింది. ద్వారకానాథ్ రెడ్డి సునీతా రెడ్డి భర్త. కేంద్ర మంత్రి దయానిధి మారన్‌కు సునీతా రెడ్డి సన్నిహితురాలని, ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆ వాటాను పొందారని ఆరోపణలు వస్తున్నాయి.

English summary
CBI made searches in Apollo hospitals group joint MD Suneetha Reddy's house and offices in 2G spectrum scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X