వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంకు ఢిల్లీకి పిలుపు, తెలంగాణపై కోర్ కమిటీ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధిష్టానం అలుపు లేకుండా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. మంగళవారం సాయంత్రం తెలంగాణపై చర్చించేందుకు కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. తెలంగాణపై సాయంత్రం కోర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆహ్వానం అందించడానికి ప్రాధాన్యం చేకూరినట్లు భావిస్తున్నారు.

కాగా, నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఆజాద్ నుంచి పిలుపు వచ్చింది. ప్రణబ్ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ ఆయన అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మినీ కోర్ కమిటీ ముందు హాజరవుతారని అంటున్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై అభిప్రాయం వెల్లడించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ప్రతినిధిగా గతంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా కోర్ కమిటీ సమావేశానికి ముందు మినీ కోర్ కమిటీ సమావేశం ముందు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.

English summary
CM Kiran Kumar Reddy has been invited Delhi, as Congress core committee is meeting on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X