హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స ప్రయత్నం విఫలం: కదలని బస్సులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: సకల జనుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమించుకునేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఆర్టీసిలో ప్రధాన కార్మిక సంస్థ అయిన నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో బొత్స సోమవారం సమావేశమై సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఎన్ఎంయు ప్రధాన నేతలు మహమూద్, నాగేశ్వర రావు అందుకు అంగీకరించారు కూడా. సకల జనుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే వారి ప్రకటనపై తెలంగాణ ఎన్ఎంయు ఫోరం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులను కదలనివ్వమని హెచ్చరించారు. అయితే కొందరు ఒప్పుకున్న నేపథ్యంలో పాక్షికంగానైనా బస్సులు తిరగే ఆస్కారముందని ప్రభుత్వం భావించింది. కానీ మంగళవారం రహదారులు ఎప్పటిలాగే కనిపించాయి. బస్సులు రోడ్డెక్క లేదు. ఎన్ఎంయు ప్రధాన నేతల సమ్మె విరమణకు తెలంగాణలోని కార్మికులెవరూ స్పందించలేదు. విధుల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు వచ్చినట్లుగా కనిపించడం లేదు. అందుకే సమ్మె విరమిస్తున్నట్లు ఎన్ఎంయు ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో బస్సులు రోడ్డెక్కలేదు.

English summary
Telangana NMU workers gave shock to PCC chief Botsa Satyanarayana. No one driver and conductor ready to work against Sakala Janula Strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X