• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజీనామాలు ఆమోదించండి: స్పీకర్‌తో తెలంగాణ ఎంపిలు

By Pratap
|

Meera Kumar
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు లోకసభ స్పీకర్ మీరా కుమార్‌ను కోరారు. వారు బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసి తెలంగాణ ఇవ్వండి లేదా తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. స్పీకర్‌ను కలవడానికి పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కర్ రాలేదు. బాన్సువాడ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నందున ఆయన రాలేదని చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, బలరాం నాయక్, రాజయ్య స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరారు. వీరంతా జులై 4వ తేదీన తమ లోకసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అంతా విన్నానని, రాజీనామాల విషయాన్ని తాను పరిశీలిస్తానని స్పీకర్ తమతో చెప్పినట్లు మధు యాష్కీ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

మూడు రోజుల పాటు జరిగే రైల్ రోకో ఆందోళనలో తాము తమ తమ జిల్లాల్లో పాల్గొంటామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెసు కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అక్టోబర్ నెలాఖరు నాటికి తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం వెలువరిస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. అయినా ఒత్తిడి పెంచడానికి ఆందోళనలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలంతా ఆందోళనలు చేస్తుంటే తాము ఇంట్లో కూర్చోలేమని ఆయన అన్నారు. తాము కాంగ్రెసులోనే ఉన్నామని, కాంగ్రెసు పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తాము కోరుతున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

English summary
Congress Telangana MPs urged Loksabha speaker Meera kumar to accept their resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X