వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం రాజు కుంభకోణం కేసుకు తెలంగాణ సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Satyam Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజు కేసు విచారణకు తెలంగాణ సెగ తగిలింది. సకల జనుల సమ్మె నేపథ్యంలో నాంపల్లి ట్రయల్ కోర్టులో విచారణకు ఆటంకం ఏర్పడింది. దీంతో కేసు విచారణను నాంపల్లి నుంచి చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చ వలసిందిగా హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 226 మంది సాక్షులు, 15 మంది దర్యాప్తు అధికారుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది.

సకల జనుల సమ్మెకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి రెండు రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో కేసులన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో వారం రోజుల పాటు కేసులన్నీ వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. న్యాయవాదులు తెలంగాణ కోసం కోర్టులను బహిష్కరిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్చరికలను కూడా తెలంగాణ న్యాయవాదులు ఖాతరు చేయడం లేదు.

English summary
Due to Telangana heat Satyam computers scam case hearing was affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X