వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ ముందు దీక్ష: సమైక్యాంధ్ర జెఏసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

andhra pradesh
గుంటూరు: సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించుకుంది. గురువారం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర జెఏసి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంతంలోని 14 విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జెఏసి నేతలు మాట్లాడారు. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోవాలని లేదంటే రాష్ట్రంలో జరిగే ఆ పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ రథయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. నవంబరు 1వ తారీఖు లోగా సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే 2వ తారీఖు నుండి అసెంబ్లీ ముందు దీక్ష చేస్తామని హెచ్చరించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18 నుండి 22వ తేది వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సకల జనుల సమ్మెలో పాల్గొంటూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులను వెంటనే తొలగించి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధమన్నారు. కాగా ఉదయం ప్రకటించిన కార్యాచరణను వారు రద్దు చేసుకొని మధ్యాహ్నం మరో కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

English summary
Samakyandhra JAC announced their future plan to united Andhra Pradesh today in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X