వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగార్జున యూనివర్శిటీలో సమైక్యాంధ్ర జెఏసి అత్యవసర భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ap
గుంటూరు: తెలంగాణలో సకల జనుల సమ్మె, తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి గురువారం నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యవసరంగా భేటీ అయింది. తెలంగాణలో కొనసాగుతున్న సకల జనుల సమ్మె, సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాల్సిన తీరుపై చర్చించనున్నాట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా అలాగే సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం. చర్చకు ముందు సమైక్యాంధ్ర రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ శామ్యూల్, విద్యార్థి ఐకాస నేత కిషోర్ మాట్లాడారు.

సమ్మె వల్ల విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలంలో బాన్సువాడ ఉప ఎన్నికలో జరిపించడం ప్రజాస్వామిక విజయమన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేంద్రం వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే ఉద్యమం తీరు మారుతుందని హెచ్చరించారు.

English summary
Samaikyandhra JAC leaders organizing meeting at Nagarjuna University of Guntur district today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X