హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే పదవికి జూపల్లి కృష్ణారావు రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupalli Krishna Rao
హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన రాజీనామా వెంటనే ఆమోదించాలని ఆయన కార్యదర్శిని కోరారు. అనంతరం ఆయన సిఎల్పీలో విలేకరుల సమావేశం పెట్టడానికి సిద్ధమయ్యారు. కార్యాలయం అధికారులు ఆయనను అడ్డుకొని తాళం వేశారు. దీంతో ఆయన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంతకూ తాళం తీయక పోవడంతో ఆయన మరోచోట సమావేశాన్ని పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేస్తే తెలంగాణపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ఇవ్వనని చెబితే పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

సిఎల్పీలోకి తనను అనుమతించక పోవడంపై ఆయన ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎమ్మెల్యేలం అయితేనే కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాడని తమను సిఎల్పీలోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలమంటూనే పలువురు నేతలు రెండోసారి రాజీనామాలు చేయడానికి వెనకాడుతున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మీకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల కోరిక మేరకే తాను రాజీనామా చేశానన్నారు.

తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి నుండి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చేయడం బాధాకరమే అయినప్పటికీ ఆ ఆరోపణలు చేసిన వారి నోరు మూయించే అవసరం మనకు లేదా అని ప్రశ్నించారు. అలా చేయాలంటే రాజీనామాలతో అందరూ ముందుకు రావాలన్నారు.

English summary
Former minister Jupalli Krishna Rao resigned for his MLA post today. He suggested Telangana ministers to resign for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X