హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం గాజులు తొడుక్కోలేదు: డిజిపికి టి-ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Rajagopal Reddy
హైదరాబాద్: డిజిపి దినేష్ రెడ్డి పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే తాము గాజులు తొడుక్కొని కూర్చోలేదని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఉదయం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు తాము రైలు రోకోలో పాల్గొంటామని చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులు వెంటనే ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని సూచించారు. మంత్రులు రాజీనామా చేయకుంటే ఇళ్ల నుండి కదలలేని పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు.

రైలు రోకోపై డిజిపి చేసిన హెచ్చరికలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. డిజిపి పరిధి దాటుతున్నారన్నారు. పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. తాము రూలింగ్ పార్టీలో ఉండి కూడా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధమయ్యామంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాలన్నారు. తమపై కేసులు పెట్టిన తర్వాతే ఉద్యమకారులపై పెట్టాలన్నారు. పోలీసుల తుపాకీ గుళ్లకు తామే ముందుంటామన్నారు. రైలు రోకోలో మాత్రమే కాకుండా ఇక నుండి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటామని డిజిపి ఎంతమందిని బలగాలతో ఎంతమందిని అరెస్టు చేస్తారో చూస్తామన్నారు.

English summary
Telangana Congress MPs warned DGP Dinesh Reddy about his comments. They challenged him to obstruct rail roko.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X