హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెగ: 124 రైళ్లు రద్దు, ప్రభుత్వ బీరాలు ఉత్తవే

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రైల్ రోకోను అడ్డుకుని తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం బీరాలు పలికినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే అందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జెఎసి ఈ నెల 15, 16, 17 తేదీల్లో తలపెట్టిన రైలో రోకో సందర్భంగా దక్షిణ మధ్య 124 ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తోంది. స్థానిక రైళ్లతో పాటు ఇతర రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైళ్లకు రక్షణ కల్పిస్తామని రాష్ట్ర పోలీసులు హామీ ఇచ్చినప్పటినకీ తెలంగాణ ప్రాంతంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన తెలియజేస్తోంది.

సికింద్రాబాద్ - కాజిపేట, సికింద్రాబాద్ - వాడి, వికారాబాద్ - పార్లీ, నడికుడి - బీబీనగర్, సికింద్రాబాద్ - ముద్ఖేడ్, విజయవాడ - కాజిపేట - బల్హార్షా, సికింద్రాబాద్ - డోన్, డోర్నకల్ - మణగూరు, నిజామాబాద్ - బోధన్, పెద్దపల్లి - జగిత్యాల, ఆదిలాబాద్ - కిన్వత్ సెక్షన్లలో రైళ్ల రాకపోకలపై రైలో రోకో ప్రభావం పడనుంది. దక్షిణ మధ్య రైల్వే మూడు రోజుల పాటు 124 ప్యాసెంజర్ రైళ్లను పూర్తిగా, 38 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తోంది. 68 రైళ్లను దారి మళ్లిస్తోంది. 19 రైళ్లను రీషెడ్యూల్ చేస్తోంది. ఎనిమిది రైళ్లను నియంత్రిస్తోంది. సికింద్రాబాద్ - లింగపల్లి, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తాయి. ఫలక్‌నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్ మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు రద్దవుతున్నాయి.

English summary
In view of the rail-roko call given by Telangana Joint Action Committee in Telangana region, the South Central Railway (SCR) on Thursday announced cancellation of as many as 124 passenger trains for the three-day period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X