నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునీతా లక్ష్మారెడ్డి కారుకు గాలి తీసిన తెలంగాణవాదులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunitha Laxma Reddy
హైదరాబాద్/నిజామాబాద్: మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి శుక్రవారం తెలంగాణవాదుల నుండి చుక్కెదురయింది. చికిత్స నిమిత్తం ఆమె ముషీరాబాదులోని మహాత్మా గాంధీ వైద్యశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న తెలంగాణ వైద్యుల ఐక్య కార్యాచరణ సమితి ఆమెను అడ్డుకున్నారు. తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆమె కారు టైర్లలో గాలి తీసేశారు. పోలీసులు కలుగజేసుకొని ఆమెను వేరే వాహనంలో వెనక్కి పంపించారు. పోలీసులకు, వైద్యులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వైద్యులపై దాడిని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం ఖండించారు.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెలంగాణ ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి శాసనమండలి సభ్యుడు మోహన్ రెడ్డి వచ్చారు. ఆయనను తెలంగాణవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వేదికపై మాట్లాడుతుండగా ఒకరు ఆయనపైకి చెప్పు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.

English summary
Telangana doctors JAC obstructed minister Sunitha Laxma Reddy today at Gandhi Hospital today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X