హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్యానందపై సినిమాలు తీస్తే చర్యలు: ధనంజయ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
హైదరాబాద్: తమిళ నటి రంజితతో రాసలీలలు నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామి నిత్యానందను అప్రదిష్ట పాలు చేసేలా సినిమాలు తీస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తరఫు న్యాయవాది ధనంజయ్ హెచ్చరించారు. నిత్యానందను కించపరిచే కథతో కన్నడంలో సత్యానంద పేరుతో నిర్మించిన సినిమా విడుదలను బెంగళూర్ సివిల్ కోర్టు నిలిపేసిందని ఆయన చెప్పారు. ఆ సినిమా నిర్మాతనే ఇప్పుడు తెలుగులో స్వామి సత్యానంద పేరుతో తెలుగులో సినిమా నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు.

స్వామి సత్యానంద పేర తెలుగులో సినిమా తీస్తే అది కోర్టు ధిక్కారమవుతుందని ఆయన చెప్పారు. నిత్యానంద స్వామిపై లైంగిక ఆరోపణలు రుజువు కాలేదని, అందువల్ల నిత్యానందను దోషిగా చిత్రీకరిస్తూ సినిమాలు తీయడం పరువు నష్టం కిందికి వస్తుందని ఆయన అన్నారు.

English summary
Swami Nithyanada's lawyer Dhanjay said that action will be taken, if films will be produced on KCR controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X