ప్రభుత్వాన్ని కూల్చేందుకు వెనకాడం: టి-కాంగ్రెసు

ఎంపీలపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. నేతల అరెస్టు ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణపై స్పందించకుంటే పార్టీని వీడి ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు. సమ్మె విరమించాలని మంత్రులే కోరటం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని అణిచి వేయాలని కిరణ్ ప్రభుత్వం చూస్తోందన్నారు.
తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. సీమాంధ్ర నేతలను తెలంగాణ నుండి ఉరికిస్తామన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలను జైల్లో పెట్టండి అప్పుడు మా తడాఖా నిరూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని సూచించారు. తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు.












Click it and Unblock the Notifications