నో సైన్ నో శాలరీ: సమ్మెపై రూటు మార్చిన టి-టీచర్లు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లి తమ డిమాండ్లకు ఆమోదం తెలిపితే వారు వెంటనే విధుల్లోకి హాజరై హాజరు పట్టికలో సంతకం చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తమ నిరసన తెలపనున్నారు. కాగా తెలంగాణలో పలు జిల్లాల్లో రైలు రోకోలు ఆదివారం కొనసాగాయి. కానీ తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, రైళ్లను అడ్డుకుంటే కఠినమైన కేసులు పెడుతున్న నేపథ్యంలో రెండోరోజు రైలురోకో అంతగా ప్రభావం చూపించనట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం బందు పిలుపునకు ఆటో డ్రైవర్ల సంఘం మద్దతు పలికింది. రంగారెడ్డి జిల్లా వికారాబాదు పట్టణం పరిసరాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ బస్సును దగ్ధం చేశారు. తాండూరులో రైల్వే ట్రాక్ పైన గోడ కట్టారు.
తుకారాం గేటు వద్ద తెలంగాణవాదులపై మంత్రి దానం నాగేందర్ అనుచరుల దాడిని తెలంగాణ లాయర్ల జెఏసి ఖండించింది. దానంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని మంత్రి జానారెడ్డితో సహా పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులను ద్రోహులుగా పరిగణిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications