వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్తం, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy and Jana Reddy
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మరో మంత్రి జానారెడ్డి ఇళ్లను తెలంగాణవాదులు ఆదివారం ముట్టడించటంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శనివారం రైలు రోకోలో పాల్గొన్న మహిళా నేతలను అరెస్టు చేసి రాత్రంతా జైలులో ఉంచడంపై మండిపడిన తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం కార్యకర్తలు శ్రీనగర్ కాలనీలోని సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. ఉద్యమకారులపై కేసులను ఉపసంహరించుకోవాలని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళ హోం మినిస్టర్ ఉన్నప్పటికీ మహిళలను రాత్రంతా జైలులో పెడితే ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సబిత వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.

మంత్రి జానారెడ్డి ఇంటిని తెలంగాణ లాయర్ల ఐక్య కార్యాచరణ సమితి ముట్టడించింది. సకల జనుల సమ్మెను విరమించాలని చేసిన ప్రకటనకు నిరసనగా వారు ఆందోళన చేపట్టారు. సమ్మెను విరమించాలని కోరటం కాదని మీరే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాయర్లను అరెస్టు చేసి బంజారాహిల్సు పోలీసు స్టేషన్‌కు తరలించారు. జానారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల తెలంగాణవాదులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

English summary
Telanganites created tension at Home Minister Sabita Indra Reddy's and Jana Reddy's residence today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X