వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ మంత్రులు: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విశాఖపట్నం: తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రస్తుతం ఎటూ తేల్చుకోలని పరిస్థితిలో ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం విశాఖపట్నంలో అభిప్రాయపడ్డారు. వారు ప్రభుత్వంలో ఉన్నందున బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి వారు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకునే అవకాశం లేదన్నారు. దీంతో వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. సకల జనుల సమ్మె సెంటిమెంటు మీద ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతోందన్నారు. సమ్మెను విరమింప చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు.

నేతలతో పాటు అన్ని సంఘాలతోనూ సమ్మెపై చర్చించి విరమింప చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు. సమయం చెప్పక పోయినప్పటికీ త్వరలో పరిష్కారం రావచ్చన్నారు. పరిష్కారం శాశ్వతంగా, ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతాయన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana says today that Telangana ministers are in dilemma on agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X