వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై నిర్ణయం నేనేరుగ: రేణుకా చౌదరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudary
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంనేది తనకు తెలియదని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. త్వరలో నిర్ణయం వెలువడుతుందని కాంగ్రెసు నాయకులు చెబుతుండడంపై ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా ప్రతిస్పందించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా తెలంగాణ సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ప్రశాంత వాతావరణంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆమె అన్నారు. తాను తెలంగాణకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యురాలినని, తన నియోజకవర్గం ఖమ్మం తెలంగాణలోనే ఉందని ఆమె అన్నారు.

తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రెండు ప్రాంతాల నాయకులతో తమ పార్టీ అధిష్టానం ఇప్పటికే చర్చలు జరిపిందని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్ర్తత్యేక పరిస్థితులున్నాయని, వీటిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. చర్చల ద్వారా తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి తమ కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమ్మె పరిష్కారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
AICC Renuka Choudary said that she doesn't know when the decission on Telangana will be delivered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X