హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదండరామ్‌పై మంద కృష్ణ మాదిగ డైరెక్ట్ వార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత తన సమరాన్ని కొనసాగిస్తున్నారు. సమ్మె నుంచి విద్యాసంస్థలను మినహాయించకపోతే తాడోపోడో తేల్చుకుంటానని, ధర్నాకు దిగుతానని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో కోదండరామ్‌ను హెచ్చరించారు. తెలంగాణ వచ్చేవరకు సమ్మె చేస్తామని ప్రకటించి ఇప్పుడెందుకు విరమించారో జేఏసీ నేత కోదండరాంరెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రజలకు చెప్పాలని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన రాకపోయినా ఎంతకు అమ్ముడుపోయి సమ్మె విరమించారో చెప్పాలని నిలదీశారు.

ముస్లిం నేత మహమూద్ సమ్మె విరమణ ప్రకటన చేస్తే తెలంగాణ ద్రోహమని చెప్పి, అదే ఇద్దరు రెడ్లు కలిసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటిస్తే అది న్యాయం ఎలా అవుతుందన్నారు. ఆర్టీసి సమ్మె విరమణకు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని ఆయన కోదండరామ్‌ను అడిగారు. ఆర్టీసీలో సమ్మె వల్ల పేదలకు కష్టాలు, కోదండరాం, కేసీఆర్, వ్యాపారులకు లాభాలు మిగిలాయని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మె నుంచి సినిమా థియేటర్లు, బ్రాందీ షాపులు, ప్రైవేటు బస్సులను ఎందుకు మినహాయించారో కోదండరాం, కేసీఆర్ బహిరంగ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాటిని మినహాయించి ఎంత దండుకున్నారని ప్రశ్నించారు.

పేదలు విద్యకు దూరమైతే కోదండరాం, కేటీఆర్, కవిత, హరీశ్‌రావుల పిల్లలు మాత్రం చదువుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కోదండరాం పిల్లలకు ఒక నీతి, పేదల పిల్లలకు మరో నీతా? అని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ లక్ష్యమని రాజకీయ జేఏసీలో తీర్మానం చేస్తే కోదండరాంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంద కృష్ణ ప్రకటించారు.

English summary
MRPS leader Manda Krishna Madiga continued his attack on Telangana JAC convener Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X