వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్, కోదండరామ్‌లకు ఎమ్మార్పీయస్ సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

KCR and Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌లకు సోమవారం సాయంత్రం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తల సెగ తగిలింది. తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం న్యూడెమొక్రసీ కార్యాలయం మార్క్స్ భవన్‌లో ఏర్పాటైంది. ఈ సమావేశంలో కెసిఆర్, కోదండరామ్ పాల్గొన్నారు. తమకు సామాజిక తెలంగాణ కావాలంటూ ఎమ్మార్పీయస్ కార్యకర్తలు మార్క్స్ భవన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సామాజిక తెలంగాణ కావాలంటూ వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యాసంస్థలను బంద్ నుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేశారు. చాలా సేపు వారు ధర్నా చేసిన తర్వాత పివోడబ్ల్యు నేత సంధ్య బయటకు వచ్చి వారిని ఉద్దేశించి మాట్లాడారు.

ఎమ్మార్పీయస్ కార్యకర్తల తీరును ఆమె తప్పు పట్టారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం సమావేశం నిర్వహించిన కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగుతారా అని ఆమె ప్రశ్నించారు. తాము సామాజిక తెలంగాణ కోసమే పోరాడుతున్నామని, దాని కోసం ప్రభుత్వంతో పోరాడాలి గానీ ఇక్కడ ధర్నా చేయడమేమిటని ఆమె అన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై పోరాటం చేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము పోరాడుతామని ఆమె అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డిని, జానా రెడ్డిని, తదితర అగ్రవర్ణాలవారిని ప్రశ్నించకుండా తమ కార్యాలయం ముందు ధర్నా చేయడం సరి కాదని ఆమె అన్నారు. తెలంగాణ అన్ని కులాల వారు పోరాడుతున్నారని, ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలో భాగంగా ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. రేపటి నుంచి పాఠశాలలను తెరుస్తామని చెప్పినా ఎమ్మార్పీయస్ కార్యకర్తల ద్వారా మందకృష్ణ ధర్నా చేయిస్తున్నారని న్యూడెమొక్రసీ నాయకులు అన్నారు.

English summary
MRPS workers staged dharna in front of New Democracy office. TRS president KCR faced the heat of MRPS workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X