హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ జిల్లాల్లో బంద్ సంపూర్ణం, రాజధానిలో పాక్షికం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రైలు రోకోలో నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు సోమవారం తెలంగాణలోని జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా స్వచ్చంధంగా కొనసాగుతోంది. తెలంగాణలోని పది జిల్లాల్లో బస్సులు ఎక్కడికక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. బందుకు తెలంగాణ ఆటోల సంఘాలు కూడా మద్దతు పలకడంతో ఆటోలు కూడా రహదారులపై కనిపించలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లో వ్యాపారులు అందరూ స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బందుకు మద్దతు తెలుపుతున్నారు.

రాజధాని హైదరాబాదులో మాత్రం బస్సులు పాక్షికంగా తిరుగుతున్నాయి. పలుచోట్ల బస్సులు డిపోలు దాటి బయటకు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. లింగంపల్లి - నాంపల్లి రూట్లలో ఎంఎంటిఎస్ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బందు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాచారంలో రోడ్డెక్కిన ఓ ప్రైవేటు బస్సును తెలంగాణవాదులు ధ్వంసం చేశారు.

English summary
Telangana people are supporting JAC's bandh. Business men closed their shopes without any forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X