హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గన్‌మెన్‌ను సరెండర్ చేసిన తెరాస ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao-KT Rama Rao
హైదరాబాద్: తమ భద్రత కోసం కేటాయించిన గన్‌మెన్‌ను సరెండర్ చేస్తూ 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు తమ జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. పోలీసు ఆఫీసర్ల సంఘం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు తమ గన్‌మెన్‌ను సరెండర్ చేయాలని తెరాస శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. తాము ఆపరేషన్ దుర్యోధన సినిమాలో మాదిరిగా వ్యవహరించాల్సి ఉంటుందని, తాము భద్రత ఇవ్వకపోతే రాజకీయ నాయకులు వీధుల్లో తిరగలేరని ఇటీవల పోలీసు ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు చలపతి రావు వ్యాఖ్యానించారు. దీనికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తమకు రక్షణ అక్కర్లేదంటూ ఎస్పీలకు లేఖలకు రాశారు.

శాసనసభ్యులు కెటి రామారావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితర తెరాస శానససభ్యులు తమ తమ గన్‌మెన్‌ను సరెండర్ చేస్తూ ఎస్పీలకు లేఖలు రాశారు. తమ శాసనసభ్యులను ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజల్లో తిరగడానికి వారికి భద్రత అక్కర్లేదని తెరాస నాయకుడు కర్నె ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీసు ఆఫీసర్ల సంఘం వ్యాఖ్యలకే కాకుండా డిజిపి దినేష్ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా కూడా గన్‌మెన్‌ను సరెండర్ చేయాలని తమ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

English summary
TRS MLAs have written letters to respective district SPs surrendering gunmen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X