వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్‌పై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
లక్నో: అన్నా హజారే టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్‌పై లక్నోలో మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. లక్నోలోని ఝలేలాల్ పార్క్‌లో ఏర్పాటైన బహిరంగ సభలో ఈ దాడి జరిగింది. ఆయనపైకి బూటు విసిరి ఓ వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన వ్యక్తిని జులాన్‌కు చెందిన జితేంద్ర పాఠక్‌గా గుర్తించారు. ఆ వ్యక్తిని స్వచ్ఛంద సేవకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్‌తో తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, అవినీతిపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆ వ్యక్తి అన్నాడు. తాను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కానని అతను చెప్పాడు.

కేజ్రీవాల్ ఆ వ్యక్తిని క్షమించాడని, అతనిపై కేసు నమోదు చేయవద్దని చెప్పామని టీమ్ అన్నా కోర్ కమిటీ సభ్యుడు సంజయ్ సింగ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. అన్నా టీమ్ సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై జరిగిన దాడిని మరిచిపోక ముందే కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. కేజ్రీవాల్‌పై దాడిని ప్రస్తావిస్తూ తాము బెదిరిపోవడం లేదని, అవినీతిని అంతం చేయడానికి తాము బుల్లెట్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నా హజారే అన్నారు. అవినీతిపై ప్రజలను చైతన్యపరచడానికి తాను లక్నోలో పర్యటించదలుచుకున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Team Anna member Arvind Kejriwal was attacked in a public meeting in Jhulelal park in Lucknow on Tuesday evening. A person attempted to assault Kejriwal by hurling a shoe at him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X