వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మ తిరిగి వివరణ ఇచ్చిన మంత్రి జానా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం త్యాగం చేయడంలో తాను అగ్రభాగాన ఉంటానని తెలంగాణకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. తనపై వచ్చిన విమర్శలకు ఆయన కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశనాంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీలో క్లాస్ తీసుకోవడంతో ఆయన దిమ్మ తిరిగి ఈ వివరణ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తెలంగాణ సాధనే తన లక్ష్యమని ఆయన అన్నారు. తన రాజీనామా వల్ల మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మెను విరమించాలని తాను చేసిన విజ్ఞప్తిని కొంత మంది, శ్రేణులు, ప్రజా సంఘాలు అనుమానించాయని, తాను తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. సమ్మెకు విరామం ఇవ్వాలని మాత్రమే తాను భావించి ఆ ప్రకటన చేశానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన అన్నారు.

ఉద్యమంలో ఒక అడుగు వెనక్కి, రెండు అడుగులు ముందుకు వెళ్లాలనే ఎత్తుగడలో భాగంగానే తాను సమ్మె వాయిదా వేయాలని సూచించానని ఆయన చెప్పారు. తాము కొన్ని పరిమితులతో తాము పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందు భాగాన ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన సమయంలో తాను ముందుండి వంద మందికిపైగా రాజీనామా చేయించడానికి తాను కృషి చేశానని, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ వచ్చిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేస్తామని కొందరు మాట్లాడడం సరికాదని, దాన్ని కూడా తాము ఆవేదనతో మాట్లాడిన మాటలుగానే తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసును టార్గెట్ చేయడం సరి కాదని, తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు అగ్రభాగాన ఉంటుందని ఆయన చెప్పారు.

తాను తెలంగాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆయన చెప్పారు. తాను 1989లోనే తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం తాను చేసిన కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను పనిచేస్తున్నానని చేసిన విమర్శలు అపోహలు, అనుమానాలు మాత్రమేనని ఆయన అన్నారు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు అగ్రభాగాన ఉన్నవారికి ఊపిరి పోసింది కాంగ్రెసు నాయకులేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై జాతీయ స్ధాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ సాధనే తన లక్ష్యమని, అవసరం వచ్చినప్పుడు తాను తెలంగాణ కోసం ఎటువంటి త్యాగం చేస్తానో తెలుస్తుందని ఆయన అన్నారు.

English summary
Minister from Telangana Jana Reddy cleared his stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X