హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమం ఆగే ప్రశ్న లేదు మార్పే: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగే ప్రశ్నే లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం స్పష్టం చేశారు. కేవలం ఉద్యమం రూపు మాత్రమే మారుతుందన్నారు. ఉద్యమం రూపు మారటం సహజమైనదే అన్నారు. ఉద్యమంలో అన్ని వర్గాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. ఉద్యమం నుండి ఇప్పటి వరకు ఎవరూ తప్పుకోలేదని ఇక ముందు కూడా తప్పుకోరన్నారు. సమ్మె ఆపే ప్రసక్తి లేదన్నారు. సకల జనుల సమ్మె కారణంగా కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు.

కాగా బుధవారం సమ్మెకు మద్దతుగా వైన్ షాపులు మూసివేస్తున్నట్టు వైన్ షాప్ అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణ రాజకీయ జెఏసి మద్దతు పలికింది. ఈ సందర్భంగా వైన్ షాపు సంఘం మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులతో బలవంతంగా మద్యం డిపోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా సమ్మె కొనసాగుతుంటే మద్యం అమ్మకాలను ప్రోత్సహించడటం ఏమిటని ప్రశ్నించారు. సమ్మె జరిగినన్ని రోజులు మద్యం అమ్మకాలపై అద్దె రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

English summary
Telangana Political JAC chairman Kodandaram said today that Telangana agitation will continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X