వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి జానారెడ్డి దుమ్ము దులిపిన తెలంగాణ ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: మంత్రి జానారెడ్డిపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. తామంతా రైల్ రోకోలో పాల్గొని అరెస్టయితే కూడా మాట్లాడకపోవడం దారుణమని వారన్నారు. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో మంగళవారం కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జానా రెడ్డి తీరుపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. తెలంగాణ మంత్రులపై తీరుపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైల్ రోకోలో పాల్గొన్నందుకు అరెస్టు చేస్తే తెలంగాణ మంత్రులు కనీసం నోరు కూడా ఎత్తకపోవడాన్ని వారు తప్పు పట్టారు. రాజీనామా ఎందుకు చేయరంటూ వారు మంత్రులను నిలదీశారు. స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను జానారెడ్డి నిర్వహించడం లేదని వారు విమర్శించారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ నాయకులు మండిపడ్డారు. వారిద్దరి తీరును సమావేశంలో వారు తప్పు పట్టారు. మంత్రి దానం నాగేందర్‌పై తెలంగాణవాదులు కోడిగుడ్లు విసిరితే ఖండించిన బొత్స సత్యనారాయణ తమను అరెస్టు చేస్తే ఎందుకు మాట్లాడలేదని వారు అడిగారు. రైలో రోకోలో పాల్గొంటే తప్పు పడుతున్న కాంగ్రెసు నాయకులు సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో సమావేశమైతే ఎందుకు వ్యతిరేకించడం లేదని అడిగారు. తెలంగాణ నేతల పట్ల కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వివక్ష ప్రదర్శిస్తున్నారని వారు విమర్శించారు. కెకె నివాసంలో స్టీరింగ్ కమిటీ సమావేశం వేడివేడిగా సాగింది.

English summary
Congress Telangana MPs lashed out at minister Jana reddy for not reacting on their arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X