వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మాట తప్పం: డిసెంబర్ 9పై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

botsa sathyanarayana
విశాఖపట్నం: తెలంగాణపై 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం విశాఖపట్నంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంశంపై మాట తప్పనిది కాంగ్రెసు పార్టీ ఒక్కటే అని చెప్పారు. కాంగ్రెసు ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పదన్నారు. ఇరు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు సొంతగా కార్యాచరణ రూపొందించుకొని వారి వారి ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవచ్చునని చెప్పారు. కానీ ఇతర పార్టీలతో కలిసి పని చేస్తే మాత్రం సరికాదన్నారు. సొంతగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. సకల జనుల సమ్మెలో 85 శాతం మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు లెక్కలు ఉన్నాయన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ అవినీతిపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు.

కాగా అంతకుముందు ఉదయం హైదరాబాదులో మాట్లాడిన ఆయన తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాలు వినిపిస్తున్న నేతలు ఏ జెఎసిల్లోనూ పని చేయవద్దని ఆయన సూచించారు. ప్రజల మనోభావాలను పార్టీపరంగా మాత్రమే వినిపించాలని, ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ నేతలు వారి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి మాత్రమే వినిపించాలని ఆయన అన్నారు. ఇతర పార్టీలతో కలిసి పనిచేయవద్దని ఉద్యమాలు చేయవద్దనేది పార్టీ విధాన నిర్ణయమని ఆయన చెప్పారు. సున్నితమైన తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, అందుకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమ్మె విరమించడం వల్ల తెలంగాణ వాదం వెనక్కి పోయిందని, ఓడిపోయిందని అనుకుంటే పొరపాటని, అలా ఎవరూ మాట్లాడవద్దని ఆయన అన్నారు. పట్టుదలను, ఐక్యతను చాటి చెప్పేందుకు, మనోభావాలను వ్యక్తం చేయడానికి సమ్మెను వాడుకోవాలే తప్ప సమ్మెతో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు.

కాగా తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెసు కట్టుబడి ఉంటుందని తాను చెప్పినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana make comments against Seemandhra today at Vishakapatnam. He hoped Congress will commited for December 9th statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X