హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ స్థానం: చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Chiranjeevi
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితో సమావేశమయ్యారు. వారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో సమ్మె ప్రభావం, అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న సమైక్య ఉద్యమాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా వెళ్లడంతో ఖాళీ అయిన శాసనమండలి స్థానంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యాక చిరు తరఫు నేతలకు ఎలాంటి పదవీ దక్కలేదు. చిరంజీవికి సైతం పదవులు వరిస్తాయని వాదనలు వినిపించడమే తప్ప ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో పలువురు నేతలు దానిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం నుండి వచ్చిన వారు ప్రధానంగా ఈ సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో బొత్స చిరుతో భేటీ కావడం ప్రాధావ్యత సంతరించుకుంది. కోటగిరి విద్యాధర రావు తదితరులు ఎమ్మెల్సీ స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్య వైశ్య నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వైశ్యులకే ఆ స్థానం కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే.

English summary
PCC chief Botsa Satyanarayana met with Tirupati MLC Chiranjeevi today and talk about present political situations and MLC seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X