హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సకల జనుల సమ్మె: ఎన్ఎంయులో చీలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరుగుతున్న సకల జనుల సమ్మె కారణంగా ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్‌లో విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. తెలంగాణ ఎన్ఎంయు బయటకు వచ్చి కొత్తగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతోంది. కొద్దిరోజుల క్రితం ఎన్ఎంయూ అగ్రనేతల అనుమతితో రూపుదిద్దుకొన్న ఎన్ఎంయూ తెలంగాణ ఫోరం ఇందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఫోరం నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సభ ఇందుకు వేదికైంది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్‌రావు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో పాటు ఎన్ఎంయూ తెలంగాణా ఫోరం నాయకులు అశ్వథ్థామరెడ్డి, థామస్ రెడ్డి, బీవీ రెడ్డి, వి.తిరుపతి పాల్గొన్నారు.

సంఘాన్ని గురువారం రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాధించాలనే ఆకాంక్షతో చేస్తున్న సమ్మెకు ఇటీవల వారు తూట్లు పొడిచారని తెలంగాణ ఆర్టీసీ నేతలు ఎన్ఎంయు అగ్రనేతలపై విరుచుకు పడ్డారు. వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యమకార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలతో పాటు 8 తీర్మానాలను చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందాల్సిన వాటాపై పోరాడనున్నట్లు శపథం చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ సకలజనుల సమ్మెలో ఉద్యమాన్ని భుజస్కందాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆర్టీసీ టీ-ఎన్ఎంయూ కార్మికులదేనని పేర్కొన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంఘం పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు.

English summary
Telangana RTC NMU leaders announced that they will registered Telangana Majdur Union name soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X