గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధలు వింటూ పొలంలోనే కూర్చుండిపోయిన జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పసుపు రైతుల అవస్థలు వింటూ కాసేపు అలాగే పొలంలో కూర్చున్నారు. ఓదార్పు యాత్రలో ఉన్న ఆయన మార్గమధ్యంలో పసుపు పొలాల్లోకి వెళ్లి రైతులను పరామర్శించారు. వారు తమ కష్టాలు చెబుతున్న సమయంలో ఆయన కాసేపు అలాగే పొలంలో కూర్చుండి పోయారు. వారికి జరిగిన నష్టాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. రైతులు ఇంతటి దయానీయస్థితిలో ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం గుడ్డిది, చెవిటిది, మనసులేనిది అంటూ విమర్శించారు.

ప్రభుత్వం రైతుల కష్టాలు చూసి ఇప్పటికైనా పొలం బాట పట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలన్నారు. అప్రకటిత కరెంటు కోతల కారణంగా తగ్గిపోయిన పంట దిగుబడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పంటకు న్యాయమైన ధర చెల్లించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పటికీ పసుపు ధరకు రేటు భారీగా పడిపోయిందని విమర్శించారు. పంట ధర తగ్గిపోగా ఎరువుల ధరలు భారీగా పెరిగాయని విమర్శించారు.

English summary
YSRC Party president YS Jaganmohan Reddy sat in fields in yesterday's odarpu yatra. He heared formers problems and fired at government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X