అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సభలోనే శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి శుక్రవారం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జిల్లాలోని రాయదుర్గం మండలం బిఎన్ హళ్లీలో ఇందిరా జలప్రభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కాపు రామచంద్రా రెడ్డి రాయదుర్గంలోని రోడ్లు పూర్తిగా చెడిపోయాయని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు లేకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే నిధులు అందజేయాలని డిమాండ్ చేశారు.
అయితే కాపు వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అదే స్థాయిలో తిప్పి కొట్టారు. రోడ్లు పాడవడానికి ఓబుళాపురం మైనింగ్ వాహనాలు తిరగడమే కారణమని కాపు వ్యాఖ్యలపై తిప్పి కొట్టారు. ఇదే విషయాన్ని వేణుగోపాల్ రెడ్డి సిఎంకు చెప్పారు. ఓఎంసి నుండి లారీలు పెద్ద ఎత్తున వెళుతుంటాయని దీంతోనే రోడ్లు పూర్తిగా పాడయ్యాయని చెప్పారు.