వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం పేరుతో ఎమ్మెల్యేలకే కిలాడీ టోకరా, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

west godavari
ఏలూరు: మంత్రి పేరు చెప్పి ఏకంగా ఎమ్మెల్యేలనే మోసగించాలని చూసిన కిలాడీలను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ కిరణాల పేరుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టనున్న విషయం తెలిసిందే. దీనిని ఆసరా చేసుకున్న కొందరు మంత్రి వట్టి వసంత్ కుమార్ పేరు చెప్పి ఎమ్మెల్యేలనే మోసగించ చూశారు.

నిందితులు ప్రసాద రాజు, యలమంచిలి రవి, బాలరాజు తదితర ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తాము రాజీవ్ యువ కిరణాలు పిడిలమని మీరు డబ్బు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అయితే చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ మేల్కొనడంతో కిలాడీలు గుట్టు బయట పడింది. మంత్రి వట్టి వసంత్ కుమార్ వెంటనే కల్పించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజేష్‌కు అగంతకులు నాలుగు నెలల క్రితమే ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుల్లో మహిళ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.

English summary
Police arrest who cheated MLAs with minister Vatti Vasanth Kumar today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X