వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకటన చేయాలని గులాం నబీ ఆజాద్‌ను కోరిన బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

botsa sathyanarayana
న్యూఢిల్లీ: తెలంగాణలోని సకల జనుల సమ్మెను విరమించమని కోరాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సమ్మె విరమించాలని కోరిందని అయితే కేంద్రం తరఫున మీరు ఓసారి సమ్మె విరమించాలని ప్రకటిస్తే పరిస్థితి సద్దుమణిగే అవకాశముందని ఆజాదుకు బొత్స చెప్పినట్లుగా తెలుస్తోంది. సకల జనుల సమ్మె ముఖ్య ఉద్దేశ్యం తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే కాబట్టి మీ ఆకాంక్షను కేంద్రం గుర్తించిందని చెబితే వారు వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని బొత్స సూచించినట్లుగా తెలుస్తోంది.

బొత్స సూచనల మేరకు ఆజాద్ సాయంత్రం సమ్మె విరమించాలని ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన గులాం నబీ ఆజాద్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించాలని కోరిన విషయం తెలిసిందే. దసరా పండుగ ముందు ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాస్తా రోకో కూడా ఉన్నందున దాన్ని విరమించాలనీ కోరారు. కాగా ఢిల్లీ వెళ్లిన పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అగ్ర నేతలతో తెలంగాణ, సకల జనుల సమ్మె, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎమ్మెల్సీ సీటుపై చర్చిస్తున్నట్టుగా సమాచారం.

English summary
PCC chief Botsa Satyanarayana suggested state incharge Ghulam Nabi Azad to appeal with draw Sakala Janula Strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X