హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం నుండి స్పందన లేదే, ఐనా..!: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: సకల జనుల సమ్మె ద్వారా కేంద్రం నుండి పదిహేను రోజుల్లో స్పందన వస్తుందనుకుంటే నలభై ఐదు రోజులైనా కేంద్రం నుండి ఎలాంటి ప్రకటన రాలేదని కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని అయినప్పటికీ తెలంగాణపై కేంద్రం స్పందించ వచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అభిప్రాయపడ్డారు. కెసిఆర్ టిఎన్జీవో నేతలతో భేటీ అయ్యారు. సమ్మె ఎంత కాలం కొనసాగిద్దాం, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది తదితర అంశాలపై వారితో చర్చించారు. తెలంగాణ అంశం కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చ జరిగింది తప్ప నిర్ణయం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఒక నెల జీతం కోల్పోయారు. మరో నెల జీతం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని, ఫలితంగా, చిరుద్యోగులు, మధ్య తరగతి ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన చెందారు.

ఇక నుండి ఉద్యమం చేయాల్సిన తీరుపై వారితో చర్చించారు. కేంద్రం ఇప్పటికే స్పందించాల్సి ఉండాల్సింది. కానీ హైదరాబాద్‌ పైనే ఆగినట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. సంయుక్త రాజధానిగా ప్రకటిస్తే ఐదు, పదేళ్ల వరకైతే మనకు అభ్యంతరం ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చలో హైదరాబాద్ వంటి ప్రత్యామ్నాయ కార్యక్రమాలతో వెళితే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయ కార్యక్రమాలు అయితేనే బెటర్ అని, పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యమిద్దామని సూచించారు.

ప్రభుత్వంతో చర్చల విషయంలో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను బట్టి నడుచుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. మొత్తం మీద ఇకపై ఉద్యోగుల సాయంతో కాకుండా రాజకీయంగానే యుద్ధం చేయాలని, ప్రత్యేకించి కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె కన్నా ఉద్యోగులు చేయగలిగిన పెద్ద ఉద్యమం ఏముండదని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని అయినప్పటికీ కేంద్రం స్పందిస్తుంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
TRS chief K Chandrasekhar Rao very disappointed with central government on Telangana issue. He hoped that centre will respond soon on sakala janula strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X