వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లోంచి పారిపోయిన 16ఏళ్ల అమ్మాయి గ్యాంగ్‌ రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Orissa
భువనేశ్వర్: ఇంట్లోంచి పారిపోయిన పదహారేళ్ల అమ్మాయి గ్యాంగ్ రేపుకు గురైన సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గంజం జిల్లాలోని ఖందగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని బారాముండ బస్ స్టాండులో సదరు టీనేజ్ అమ్మాయి రాత్రి సమయంలో బస్ కోసం నిరీక్షిస్తోంది. ఆ సమయంలో ఓ యువకుడు వచ్చి ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. ఆమె అతనితో వెళ్లింది. అయితే అతను నేరుగా తన ఇంటికి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని ఇద్దరు స్నేహితులు కూడా ఆమెను బలవంతం చేశారు.

ఈ గ్యాంగ్ రేపు విషయం కాస్తా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆమె గురువారం వారి నుండి బయటపడి ఇంటికి వచ్చాక విషయం బయట పడింది. ఆ అమ్మాయి మీడియాతో తనపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఖందగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన తల్లిదండ్రులు తనను వేధిస్తుండటంతో తన అంకుల్ ఇంటికి పారిపోవడానికి బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. అయితే పోలీసులు మాత్రం తమకు అమ్మాయి నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

English summary
A 16-year-old girl was allegedly raped by three men while she was waiting to catch a bus at the Baramunda bus stand within Khandagiri police limits here on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X