వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సోదరి షర్మిళ ఇంటికి సిబిఐ, కొలతలు ప్రారంభం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి మదింపు పనిలో ఉన్న సిబిఐ అధికారులు ఆయన సోదరి షర్మిళ ఇంటి విలువ అంచనాను లెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం జగన్ ఇంట్లో మదింపు అనంతరం అధికారులు పక్కనే ఉన్న షర్మిళ ఇంటికి వెళ్లి కొలతలు తీసుకున్నాట్లు సమాచారం. అక్కడ షర్మిళ ఇంటిని కొత్తగా నిర్మిస్తున్నారట. కాగా శనివారం మూడు రోజులుగా లోటస్ పాండ్ సమీపంలోని జగన్ ఇంట్లో ప్రతి గదిని అధికారులు కొలిచారు. 12 మంది సభ్యులున్న ఈ బృందంలో ఆరుగురు జీహెచ్ఎంసీ అధికారులు కాగా, ఇద్దరు ఆదాయ పన్ను శాఖ మదింపు అధికారులు, మరో నలుగురు సీబీఐ సిబ్బంది. ఇప్పటి వరకు జగన్, విజయమ్మలకు చెందిన ఇంట్లోని 24 గదుల్లో సీబీఐ బృందం అంచనా పనిని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

ఆఫీసుకు సంబంధించిన అంచనా పనులను సోమవారం ప్రారంభించే అవకాశాలున్నాయి. జగన్‌కు సంబంధించిన ఇంట్లోని పలు ప్రాంతాల్లో అతిధుల కోసం విశాలమైన లాంజ్‌లను, ఖరీదైన సోఫాలను, కొన్నట్టు సమాచారం. లోటస్ పాండ్ సమీపంలో చదరపు గజం భూమి విలువ ఎంతుంది? నిర్మాణ వ్యయం ఎంత? ఇంటీరియర్ డెకరేషన్‌కు ఎంత ఖర్చు పెట్టారు? ఇంట్లో ఫర్నిచర్‌కు ఎంత ఖర్చయింది? ఆ ఇంట్లో లైటింగ్, శానిటరీ ఫిటింగ్ లకు ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలను సీబీఐ సేకరిస్తోంది.

లోటస్ పాండ్ ప్రాంతంలో చదరపు గజం 50 నుంచి 60 వేల రూపాయలు ఉంటుందని, ఆ లెక్కన స్థలం విలువ 29 కోట్ల నుంచి 34 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాలో భాగంగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇంటీరియర్ డెకరేషన్, స్థల విలువ, ఇంటి నిర్మాణం తదితర విషయాలు చూసుకుంటే ఇంటి విలువ భారీగానే ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫర్నిచర్ , సిసి కెమెరాలు, జనరేటర్ సెటప్, లాన్, ఫిష్ పాండ్, టెన్నిస్ కోర్ట్, జిమ్ తదితరాలు ఉన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఇంటి విలువ అంచనా వేయడానికి మరో రెండు రోజులు పట్టవచ్చునని తెలుస్తోంది.

English summary
CBI officers went to YSR Congress Party president YS Jaganmohan Reddy's sister Sharmila's residence to measure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X