హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో కొకైన్‌తో ఇద్దరు నైజీరియన్లు అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hydrabad
హైదరాబాద్: రాజధానిలో డ్రగ్స్ మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని జూబ్లీహిల్సులో ఇద్దరు నైజీరియన్లు తమ వద్ద ఎనిమిది గ్రాముల కొకైన్‌తో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆపరేషన్ డెకాయి పేరుతో వెస్ట్ జోన్ డిసిపి స్టీఫెన్ రవీంధ్ర ఆధ్వర్యంలో వీరిని పట్టుకున్నారు. కాగా శనివారం ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తిరుపతిలో కొకైన్‌తో పట్టుబడ్డారు. వారి వద్దనున్న ఎనభై గ్రాముల కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల విదేశీయులు విద్యార్థులకు కొకైన్ అమ్ముతూ పట్టుబడిన సంఘటనలు బాగా వెలుగులోకి వస్తున్నాయి.

విదేశీయులు విద్యార్థులను, యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ అమ్ముతూ అరెస్టయినప్పటికీ విడుదలైన తర్వాత మళ్లీ వారి తీరులో మార్పు కనిపించడం లేదు. కొందరు రెండు మూడు సార్లు అరెస్టయిన విదేశీయులు కూడా ఉన్నారట.

English summary
Jubilee Hills police arrest two nigerians for having cocaine today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X