వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటుకు ఓటు కేసులో అమర్ సింగ్‌కు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Amar Singh
న్యూఢిల్లీ: నోటుకు నోటుకు ఓటు కేసులో ఢిల్లీ హైకోర్టు రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌కు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని హైకోర్టు అమర్ సింగ్‌కు ఆంక్షలు విధించింది. మానవతా దృక్పథంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోటి రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై హైకోర్టు ఈ బెయిల్‌ను మంజూరు చేసింది. నగర కోర్టు బెయిల్ నిరాకరించడంతో అమర్ సింగ్ హైకోర్టుకు వెళ్లారు.

అనారోగ్యంతో బాధ పడుతున్న అమర్ సింగ్ నిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. నిమ్స్ ఇచ్చిన వైద్య నివేదికను ఆయన ఈ నెల 12వ తేదీన హైకోర్టుకు సమర్పించారు. తనకు నిరంతరం వైద్య నిర్వహణ అవసరమని ఆయన కోర్టుకు చెబుకున్నారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్నవారికి దూరంగా ఉండాలని కూడా హైకోర్టు ఆయనను ఆదేశించింది. తక్షణమే సింగపూర్‌లో వైద్య చికిత్స అవసరమని, అందుకు అనుమతించాలని అమర్ సింగ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది.

English summary
The Delhi high court on Monday granted bail to Rajya Sabha MP Amar Singh in the 2008 cash-for-vote scam. The court restrained Amar Singh from leaving the country without permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X