హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: రామకృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు జగతి పబ్లికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డిని సోమవారం సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రామకృష్ణా రెడ్డికి సిబిఐ ఇది వరకే సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం ఉదయం హైదరాబాదులోని దిల్‌కుషా అతిథి గృహంలో సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఇంతకు ముందు సిబిఐ అధికారులు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని రోజుల తరబడి ప్రశ్నించారు. ఆ తర్వాత జగతి పబ్లికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

కాగా, జగన్ సోదరి షర్మిల నివాసంలో సిబిఐ అధికారులు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని లోటస్‌పాండులో గల షర్మిల నివాసం విలువను కట్టడంలో సిబిఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ ఇంటి కొలతలు, తదితర వివరాలను ఇప్పటికే సేకరించిన సిబిఐ అధికారులు ఇప్పుడు దాని విలువను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు.

English summary
CBI officers are questioning YS Jagan's Jagathi publications ED S Ramakrishna Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X