వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిల్ ఇష్టపడితే సినిమాల్లోకి వస్తాడు: నాగార్జున

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagarjuna
తిరుపతి: తన కుమారుడు అఖిల్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, తను ఇష్టపడితే సినిమా రంగంలోకి ప్రవేశిస్తాడని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. తన భార్య అమలతో కలిసి ఆయన బుధవారంనాడు తిరుమల శ్రీవేంకటేశ్వ స్వామిని దర్శించుకున్నారు. దీపావళి రోజు శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజన్న సినిమా తన కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమా అవుతుందని ఆయన అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథ ఆధారంగా రాజన్న సినిమా తీసినట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా అన్నివిధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. రాజన్న సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. ఆ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ నాగార్జున తిరుమలకు వచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడి కథ ఆధారంగా రాజన్న సినిమాను తీశారు. ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు.

English summary
Telugu cine hero Nagarjuna said that if Akhil wants, he will enter inti cine field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X