హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ నుండి మెడిసిన్ ఔట్, ఇక హిందీ, ఇంగ్లీషులోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

EAMCET
హైదరాబాద్: ఎంసెట్ నుండి మెడిసిన్‌ను తొలగించనున్నారు. ఇక నుండి మెడిసిన్ విద్యార్థులను జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌ ద్వారా తీసుకోనున్నారు. ఎంసెట్ నుండి మెడిసిన్ తొలగించి జాతీయస్థాయి ఎన్ఇఇటి ద్వారా ఎంట్రన్స్ నిర్వహించనున్నారు. ఎన్ఇఇటి ద్వారా జరిగే మెడిసిన్ ఎంట్రెన్స్ కేవలం ఇంగ్లీష్, హిందీలలో మాత్రమే ఉంటుంది. ఎన్ఇఇటి ప్రాంతీయ భాషల్లో ఎంట్రెన్స్ టెస్టుకు అంగీకరించలేదు. దీంతో తెలుగులో పరీక్ష జరిగే అవకాశం లేదు. ఈ విద్యా సంవత్సరం నుండే ఇది అమలులోకి వస్తుంది.

కాగా ఈ విషయాన్ని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా గురువారం స్పష్టం చేశారు. ఎంసెట్‌లో మెడికల్ పరీక్ష ఉండదని ఇక నుండి జాతీయస్థాయిలోనే ఉంటుందని చెప్పారు. పేద రోగులను కార్పోరేట్ ఆసుపత్రులు మోసం చేస్తున్నాయని, డెంగీ నిర్ధారణ కాకపోయినా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు అందినంత గుంజుకుంటున్నాయన్నారు. ఆసుపత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్లే రోగులు మోసపోతున్నారన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో అక్రమాలను అరికట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డెంగీ వ్యాధికి ఎలిసా పరీక్షలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి చెప్పారు.

English summary
Medicine will manage NEET from this year. Minister DL Ravindra Reddy also announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X