హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లీస్ పట్టు, మేయర్‌గా కార్తిక రెడ్డి కొద్ది రోజులే

By Pratap
|
Google Oneindia TeluguNews

Akabaruddin Owaisi
హైదరాబాద్: ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మేయర్ పదవి తమకు ఇవ్వాల్సిందేనని మజ్లీస్ పట్టుబడుతోంది. దీంతో మేయర్‌గా బండ కార్తిక రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయి. మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి మేయర్ మార్పుపై చర్చలు జరిపారు. కాంగ్రెసు, మజ్లీస్ పార్టీల ఒప్పందం మేరకు డిసెంబర్‌లో మేయర్ పదవిని మజ్లీస్ పార్టీకి అప్పగించాల్సి ఉంటుంది. దీంతో డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌కు కొత్త మేయర్ వచ్చే అవకాశాలున్నాయి. గతంలో కుదిరిన ఒప్పందం మేరకు మేయర్ పదవి కాంగ్రెసు, మజ్లీస్‌లకు రెండేసి ఏళ్లు ఉంటుంది.

కాగా, ఐదో ఏడాది మేయర్ పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై కాంగ్రెసు, మజ్లీస్‌ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. మేయర్ పదవి కోసం మజ్లీస్ పట్టుబడుతున్న సమయంలో తన పదవిని కాపాడుకోవడానికి కార్తిక రెడ్డి ముమ్మరమైన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించేలా లేవు. పార్టీలోనే కార్తికరెడ్డికి వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ నాయకత్వం కూడా మజ్లీస్‌కు మేయర్ పదవిని అప్పగించడానికి సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మజ్లీస్‌తో సత్సంబంధాలను కాంగ్రెసు పార్టీ ఆశిస్తోంది. మేయర్ పదవి కోసం మజ్లీస్ పార్టీ ఆరుగురి పేర్లను పరిశీలిస్తోంది.

English summary
GHMC Mayor Banda Karthika Reddy’s days as the Corporation’s boss seems to be numbered as the MIM has asked Chief Minister Kiran Kumar Reddy and PCC chief Botsa Satyanarayana to honour their seat-sharing agreement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X